ఫ్యామిలీ, స్పోర్ట్స్, కామెడీ జోనర్లలో దూసుకుపోతున్న శర్వానంద్, ఇప్పుడు మైథలాజికల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగబంధం సినిమాతో విజువల్ వండర్ సృష్టించిన అభిషేక్ నామా దర్శకత్వంలో శర్వానంద్ నటించబోతున్నారు. తక్కువ బడ్జెట్‌లో VFX మ్యాజిక్ చూపించగల అభిషేక్ నామా సామర్థ్యంపై నమ్మకంతోనే శర్వానంద్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పీరియడ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఆయన చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కానుంది. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.
నాగబంధం సినిమాతో పోలిస్తే, అభిషేక్ నామాతో చేయబోయే ఈ కొత్త మైథలాజికల్ సినిమాను మరింత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.








