గుంటూరులో జూలై 15న ఒక మహిళపై టీడీపీ నేత, ఆయన కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని వివస్త్రను చేసి హింసించిన ఈ ఘటన మూడు రోజుల పాటు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. వీడియో బయటకు వచ్చి విస్తృతంగా వ్యాపించడంతో పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది.
ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం, నిందితుడైన టీడీపీ నేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టులు చేపట్టింది. ఘటన జరిగిన సమయంలో నిందితులను పట్టుకోవడంలో అలసత్వం వహించినందుకు స్థానిక ఇన్‌స్పెక్టర్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఘటనను తొలుత అణచివేసేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.







