మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అగ్రికల్చర్ సెక్రటరీ, డీఏవోలు, ఏడీఏలు, ఎంఏవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే సంకేతాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఐఎండీ అంచనాల ప్రకారం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 15 నాటికి వర్షం తక్కువగా కురిసితే, జిల్లా యంత్రాంగం తొలి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను పూర్తిగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇప్పటికే 18 జిల్లాల్లోని దాదాపు 28 లక్షల మంది రైతులకు వాట్సాప్ ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం వంటి వాతావరణ వివరాలు నేరుగా చేరుస్తున్నారు. వాతావరణ సలహా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

జిల్లాల్లో వర్షపాతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన సమాచారాన్ని కలెక్టర్లకు అందించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయం, హార్టీకల్చర్, పశుసంవర్థక, సహకార శాఖలు మరియు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంగా రైతులకు సహాయం అందించాలని సూచించారు.