మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పార్టీని గ్రాస్‌రూట్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, పార్టీ దిశానిర్దేశాలను క్షేత్రస్థాయిలో ఏజెంట్లు మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు చేరువయ్యేలా పనిచేయడం ద్వారా పార్టీకి బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తమ పనితీరు కనబరిచే బూత్ లెవల్ ఏజెంట్లకు పార్టీలో తగిన గుర్తింపుతో పాటు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. ఇందులో భాగంగా, అత్యుత్తమంగా పనిచేసే ఏజెంట్లకు రాహుల్ గాంధీతో కలిసి ఉండే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.








