యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇస్రేల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు న్యూయార్క్ రానున్నారు. నేతన్యాహుపై అంతర్జాతీయ క్రైమ్స్ కోర్టు ఇప్పటికే అరెస్ట్ వారంట్ జారీ చేసిన విషయాన్ని జోహ్రాన్ మామ్డానీ గుర్తు చేశారు.
ఈ అరెస్ట్ ప్రక్రియపై మేయర్ జోహ్రాన్ మామ్డానీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. న్యూయార్క్ నగర చట్టాల పరిధిలో నేతన్యాహును అరెస్ట్ చేయడం సాధ్యమేనా అనే అంశంపై ఆయన నగర న్యాయ శాఖతో చర్చిస్తున్నారు.
సెప్టెంబర్‌లో నేతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పర్యటనలో ఆయనను అరెస్ట్ చేయడానికి న్యూయార్క్ నగరం చట్టబద్ధంగా సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలని మేయర్ భావిస్తున్నారు.






