హైదరాబాద్ శివారులోని మెదిపల్లిలో 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పీర్జాదిగూడకు చెందిన 36 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ నిరంజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు నిరంజన్ బాధితురాలికి గతంలోనే పరిచయస్తుడు. అయితే, బాలిక తన పాఠశాలలో జరిగిన 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్' అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మెదిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.








