హైదరాబాద్‌లోని కొకాపేటలో తొలిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుక జూలై 19న కొకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డులో ఉన్న 'ది ట్రైలైట్' వద్ద జరగనుంది.

సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సాంప్రదాయ పూజా కార్యక్రమాలు, భక్తి సంగీతం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.