టాలీవుడ్ యువ నటుడు రోషన్ కనకాల సరసన గహాజీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, సైన్స్ ఫిక్షన్ మరియు ప్రేమ కథలను కలిపి ప్రేక్షకులను ఒక కొత్త ఊహాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హైదరాబాద్‌లో జరిగిన ముహూర్పు వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ చిత్రంలో కేవలం కథ మరియు స్క్రీన్‌ప్లే అందించడం కాకుండా సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. విజయ్ కె. కమిశెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయం అవుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.
చిత్ర టైటిల్ మరియు పూర్తి నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. సైన్స్ ఫిక్షన్ మరియు ఫాంటసీ అంశాలతో కూడిన ఈ చిత్రం విజువల్ వండర్‌ను చూడటానికి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.








