ఐసిసి మహిళల టి-20 ప్రపంచకప్‌లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మహిళల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంథాన (74: 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ(55: 38 బంతుల్లో 10 ఫోర్లు ) హాఫ్ సెంచరీలతో మెరిశారు.వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
చివర్లో దీప్తి శర్మ(10ఫ 2 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్స్), రిచా ఘోష్ (20: 8 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్ లు) దూకుడుగా ఆడారు. నెదార్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే 2, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, వాన్ డెడ్ రాడ్ తలో వికెట్ పడగొట్టారు.

