శివ కుమార్ కాసారం హీరోగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజూ). నిశాంత్ దోటి దర్శకత్వంలో తేజేశ్వర్ వేల్పుచర్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కాలాన్నే తిరగేసి...’ అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు.
ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పాట ఆవిష్కరణ వేడుకకు హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మంచి సినిమాగా గుర్తిస్తారని దర్శకుడు నిశాంత్ పేర్కొన్నారు. ఈ సినిమా తమ అందరికీ మంచి భవిష్యత్తును ఇస్తుందని హీరో శివ కుమార్ నమ్మకం వ్యక్తం చేశారు.








