తమిళ సినిమా రంగంలో వైవిధ్యమైన పాత్రలకు పేరుగాంచిన అర్జున్‌దాస్ ఇప్పుడు 'సూపర్ హీరో' చిత్రంతో పూర్తి సూపర్‌హీరో పాత్రలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో తేజు అశ్విని కథానాయికగా, డాన్స్ మాస్టర్ శాండీ ప్రత్యర్థి పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కెఎస్ శినీష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. రెడాక్టెడ్ స్టూడియోస్ అధినేత షాంజన్‌జీ కూడా నిర్మాతగా పాల్గొంటున్నారు. దర్శకుడిగా విగ్నేష్ వేణుగోపాల్ పరిచయం అవుతున్నారు. ఈయన గతంలో కెఎస్ శినీష్ తో 'బలూన్' చిత్రంలో సహాయ దర్శకుడిగా పనిచేశారు.

చిత్ర ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి పోస్టర్ విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. రెండో పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. విడుదల తేదీ మరియు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాణ సభ్యులు తెలిపారు.