అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'రాకా' చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటికీ, దీపికా పదుకోన్ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ప్రసూతి సెలవులకు వెళ్లేలోపే తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో ఆమె రాత్రిపూట కూడా పని చేస్తున్నారు. గతంలో ఎనిమిది గంటల పని నిబంధనను తెరపైకి తెచ్చిన దీపికా పదుకోన్, ఈ సినిమా కోసం మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా పని చేస్తున్నట్లు సమాచారం.

దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ 2018 నవంబరు 14న వివాహం చేసుకున్నారు. వీరికి దువా అనే కుమార్తె ఉంది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు దీపికా పదుకోన్ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.