హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026) ప్రక్రియలో హిజాబ్ లేదా హెడ్‌స్కార్ఫ్ ధరించిన మహిళల ఫోటోలపై గందరగోళం నెలకొంది. ఈ సమస్య హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ ధరించినా ముఖం స్పష్టంగా కనిపించాలని పేర్కొన్నారు. అయితే ఫోటోలు పూర్తిగా తీసుకోవడానికి అనుమతి ఉందని తెలిపారు.

సోషల్ మీడియాలో హిజాబ్ ఫోటోలను తిరస్కరిస్తున్నారని పుకార్లు వ్యాపించాయి. కొంతమంది బీఎల్‌వోలు కూడా హెడ్‌స్కార్ఫ్ ధరించిన మహిళల ఫోటోలను తిరస్కరిస్తున్నారని సమాచారం.

అధికారులు ఇచ్చిన క్లారిటీ ప్రకారం, హిజాబ్ ధరించిన మహిళలు ఫోటోలు సమర్పించవచ్చు. కానీ ముఖం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలని సూచించారు.