తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్ కుమార్‌కు ఉన్న క్రేజ్, ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో, అజిత్ ఆ స్థానాన్ని సులభంగా దక్కించుకునే అవకాశం ఉన్నా, ఆయన ఆ కుర్చీకి కావాలనే దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అజిత్ ఎంచుకుంటున్న సాధారణ కథలు, కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలు ఆయనలోని అసలైన స్టామినాను బయటకు తీసుకురావడం లేదని అభిమానులు చాలా కాలంగా భావిస్తున్నారు. అగ్ర దర్శకులతో బలమైన కథాంశంతో సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం అజిత్‌కు పెద్ద కష్టమేమీ కాదని వారు నమ్ముతున్నారు.
నటుడిగా అజిత్ తన వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నప్పటికీ, ఆయన ప్రతిభకు తగిన సరైన సినిమా ఇటీవల రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా మాత్రమే అజిత్ వింటేజ్ స్టైల్‌ను ప్రేక్షకులకు చూపించింది.
అగ్ర పీఠం అడుగు దూరంలోనే ఉన్నా, అజిత్ మాత్రం ఆ స్థానంపై ఆసక్తి చూపడం లేదనేది వాస్తవం. భవిష్యత్తులో సరైన దర్శకుడు దొరికితే అజిత్ విశ్వరూపం చూస్తామని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.








