మేకప్ స్పాంజ్‌లను సరిగ్గా ఉపయోగించడం వల్ల ఫౌండేషన్, బ్లష్‌లు చర్మంపై సహజంగా పూయబడతాయి.
స్పాంజ్‌ను ఉపయోగించే ముందు గోరువెచ్చటి నీటిలో పూర్తిగా తడపాలి. తేమ తగ్గిన తర్వాత మృదువుగా పిండి, టిష్యూ పేపర్‌పై అద్దాలి. కొద్దిగా తేమ ఉన్నప్పుడే క్రీములను రాసుకోవాలి. లేకపోతే ఖరీదైన ఉత్పత్తులు స్పాంజ్‌లో చిక్కుకుంటాయి.
స్పాంజ్‌ను ఉపయోగించిన తర్వాత బేకింగ్ సోడా, బేబీ షాంపూ లేదా ప్రత్యేక బార్‌సోప్‌తో శుభ్రపరచాలి. ప్రతిసారీ కడగడం వల్ల క్రీములు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఇతర సౌందర్యోత్పత్తులతో కలిపి నిల్వ చేయకూడదు. ఎందుకంటే తేమ వాతావరణంలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది.
ఈ పద్ధతులు అనుసరిస్తే బ్యూటీ బ్లెండర్ దీర్ఘకాలం పనిచేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. స్పాంజ్‌ను ప్రతిసారీ శుభ్రంగా ఉంచడం దీని రహస్యం.








