ములుగు జిల్లా వాజేడు మండలంలోని అరుణచలపురం అటవీ ప్రాంతంలో ఉన్న గుండం జలపాతంలో హైదరాబాద్‌కు చెందిన అక్తరుద్దీన్ (25) అనే యువకుడు మృతి చెందాడు. అటవీ శాఖ అధికారులు ఈ జలపాతంలోకి ప్రవేశాన్ని నిషేధించినప్పటికీ, అక్తరుద్దీన్ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం అనుమతి లేకుండా అక్కడికి వెళ్లాడు.
జలపాతంలో ఈతకు దిగిన సమయంలో, అక్కడ ఉన్న గుంతల లోతును అక్తరుద్దీన్ సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో అతను నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించి, నీటి నుండి బయటకు తీశారు.
బయటకు తీసిన తర్వాత స్నేహితులు అక్తరుద్దీన్‌కు సిపిఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారణ అయింది.








