బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటి షన్ దాఖలు చేశారు. ద్వేషపూరిత ప్రసంగం చేశారని మే 30న బంజారాహిల్స్ పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు.

చంచల్‌గూడ జైలులో 17 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారని, దర్యాప్తుకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరఫు లాయర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన కు రాజకీయంగా ఉన్న ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ కేసు పెట్టారని, తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. కాగా, బాల్క సుమ న్ దాఖలు చేసిన లీగల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు పరిశీలనకు స్వీకరించింది.