రామాంత పూర్‌లో పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ రామ్‌రాజ్ కాటన్ షోరూంను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటన్ పరిశ్రమలో రామ్‌రాజ్ కాటన్‌కు ఎంతో మంచి పేరు ఉందన్నారు.మంచి నాణ్యతో కూడిన కాట్‌ను వస్త్రాల తయారీలో ఉపయోగించడంతో పరిశ్రమకు ఎంతో కీర్తి గడించిందన్నారు. ఒక వైపు వరుసగా షోరూంలను ప్రారంభిస్తున్న రామ్‌రాజ్ కాటన్ పరిశ్రమ నిర్వహకులు ఎంతో మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మేల్యే బండారి లకా్ష్మరెడ్డి, శ్రీనివాస గుప్తా తదతరులు పాల్గొన్నారు.