సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ మరియు సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం 0.1 టీఎంసీల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు వెల్లడించారు.

తాగునీటి అవసరాల కోసం మొత్తం 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఈ నీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నీటి విడుదల నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంజీరా నదీ పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.