గత ఎనిమిది దశాబ్దాలుగా దేశం ఎన్నో సవాళ్లను దాటుకుని వచ్చిందని, అయితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత అన్నారు. న్యూఢిల్లీలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాద వృత్తి కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపోకుండా, ఉద్యమంలో ఒక భాగంగా కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు.

మీకంటే ముందు తరాలు నిర్మించిన న్యాయవ్యవస్థను సంరక్షించి, దానిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు యువతపై ఉందని జస్టిస్ సూర్యకాంత స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో పోటీ పెరిగిందని, యువ న్యాయవాదులు ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.