చుంచుపల్లిలో సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యానగర్‌లోని తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ వేడుకలో విశ్రాంత ఉపాధ్యాయులు దేవరపు వెంకటేశ్వరరావు, చింతలపూడి వెంకన్నను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉత్తమ సామాజిక నిర్మాతలుగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ అభివర్ణించారు. దేశ అభివృద్ధికి పునాది వేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సన్మాన కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, మెమొంటోలను (జ్ఞాపికలను) అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ ప్రసాద్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.