జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన 87 సబ్జెక్టుల పరీక్షల్లో, ఈ మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ప్రశ్నలు, అనువాదం, వ్యాకరణం, టైపింగ్‌లో లోపాలు ఉండటమే కాకుండా, పాత ప్రశ్నలే మళ్లీ వచ్చినట్లు NTA ఏర్పాటు చేసిన కమిటీ గుర్తించింది. తప్పులను తొలగించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని భావించి, అభ్యర్థులకు న్యాయం చేసేందుకు పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లిష్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ పరీక్షలు జరుగుతాయి. సెప్టెంబర్ 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోషియాలజీ పరీక్ష ఉంటుంది. ఈ రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలను ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తారు. ఈ రీ-ఎగ్జామ్ వల్ల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ (PhD) ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండదని NTA స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.