YouTube ప్లాట్‌ఫామ్‌పై ఆదాయం పొందాలనుకునే కొత్త క్రియేటర్ల కోసం నిబంధనలను YouTube కఠినతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న 1,000 సబ్‌స్క్రైబర్లు మరియు 4,000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ నిబంధనను, ఇకపై 8,000 వాచ్ అవర్స్ లేదా 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్‌కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం ఉన్న క్రియేటర్లపై ఈ కొత్త నిబంధనల ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. షార్ట్స్ క్రియేటర్లు 'షార్ట్స్ క్రియేటర్స్ పూల్' ద్వారా ఆదాయం పొందాలంటే, గత 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.








