ప్రధాని మోడీ అమర్‌నాథ్ యాత్రికులకు పర్యటన సమయంలో ఐదు ప్రతిజ్ఞలు తీసుకోవాలని కోరారు. దారిపొడవునా పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణ, స్థానిక వ్యాపారుల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, దేశీ సరుకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
యాత్ర క్లిష్టమైన మార్గంలో సాగుతుంది. అధికారులు వెలువరించే భద్రతా, ట్రాఫిక్ సూచనలు, మార్గదర్శకాలను యాత్రికులు పాటించాలని మోడీ పేర్కొన్నారు. ఇది అందరి భద్రతను పదిలం చేస్తుందని అతను తెలిపారు.
యాత్ర ముగింపులో రాఖీ బంధన్ ప్రాధాన్యత పొందుతుంది. యాత్రికులు పచ్చదనం నిలిపే విధంగా ఒక మొక్కను కానుకగా ఇవ్వాలని ప్రధాని సూచించారు. ఈ దశలో భారత్ వికసిత దేశం అయ్యేందుకు సమిష్టి కృషి చేయాలని సంకల్పించాలని కూడా పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. అమర్‌నాథ్ యాత్రకు కాలాతీత ఆధ్యాత్మిక వారసత్వం ఉందని, దేశంలోని ఘనమైన ఆధ్యాత్మిక భారతీయత ఈ యాత్రలో వెల్లివిరుస్తుందని అతను తెలిపారు.






