హైదరాబాద్‌లోని Inorbit Mall Cyberabad వేదికగా కొరియా సంస్కృతిని ప్రతిబింబించేలా 'సెయిల్‌స్కేప్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూలై 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది.

ఈ కార్యక్రమం సందర్భంగా మాల్‌లో సందర్శకులు కొరియా వంటకాలు, స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌తో పాటు అక్కడి సంగీతం, నృత్య రీతులను దగ్గరగా చూడవచ్చు. సెయిల్‌స్కేప్ శైలిలో రూపొందించిన ఈ ప్రదర్శనలు కొరియా సంస్కృతిని పరిచయం చేస్తాయి.

ఈ ఈవెంట్ సమయంలో మాల్‌లో ₹3,000 కంటే ఎక్కువ మొత్తానికి షాపింగ్ చేసిన వారు ప్రత్యేక బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. కొరియా సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారి కోసం మాల్ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.