హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బ్యాంక్ 119వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ మాజీ ఉద్యోగులు, కస్టమర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శాఖ మేనేజర్ జి.వి. సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో, బ్యాంక్ అభివృద్ధికి కృషి చేసిన రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. బ్యాంక్ 119 ఏళ్ల ప్రస్థానంలో కస్టమర్లకు అందిస్తున్న సేవలను, నమ్మకాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ జనరల్ మేనేజర్లు ఎం.ఎస్. రావు, సాయిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్యాంక్ సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.







