వాట్సాప్‌లో మన కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరికీ ప్రొఫైల్ ఫొటో డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. అయితే, కొన్నిసార్లు అవసరాల కోసం మనం సేవ్ చేసుకున్న వ్యక్తులకు మన ఫొటో కనిపించడం ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ ప్రొఫైల్ ఫొటోను ఎవరికి కనిపించాలో, ఎవరికి కనిపించకూడదో మీరే నిర్ణయించుకోవచ్చు.
మీ ప్రొఫైల్ ఫొటోను కొంతమంది వ్యక్తుల నుంచి దాచడానికి వాట్సాప్ 'My Contacts Except' అనే ఫీచర్‌ను అందిస్తోంది. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల ఆప్షన్‌పై నొక్కి, ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఎంచుకోవాలి.
ప్రైవసీలో ఉన్న ప్రొఫైల్ ఫొటో ఆప్షన్‌పై ట్యాప్ చేసి, అందులో 'My Contacts Except' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఫొటోను ఎవరికి కనిపించకుండా దాచాలనుకుంటున్నారో, ఆ వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి. చివరగా ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేస్తే, మీరు ఎంచుకున్న వ్యక్తులకు మీ ప్రొఫైల్ ఫొటో ఇకపై కనిపించదు.
ఒకవేళ మీ ప్రొఫైల్ ఫొటో ఎవరికీ కనిపించకూడదని భావిస్తే, 'Nobody' అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అలా కాకుండా కేవలం మీరు సేవ్ చేసుకున్న కాంటాక్ట్‌లకు మాత్రమే ఫొటో కనిపించాలంటే 'My Contacts' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఈ సెట్టింగ్ ద్వారా పరిచయం లేని వ్యక్తులు లేదా మీరు ఇష్టపడని కాంటాక్ట్‌ల నుంచి మీ ప్రొఫైల్ ఫొటోను సులభంగా దాచుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్ తన యూజర్లకు ప్రైవసీని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.








