గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్‌స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ సంస్థ రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులను చేపట్టింది. ఈ పనులను ముందుగానే పూర్తి చేసినందుకు, ఆ సంస్థ రూ.7 కోట్ల బోనస్ కోసం దరఖాస్తు చేసుకుంది.
ఈ బోనస్ సొమ్ము త్వరగా విడుదల కావాలంటే ఫైల్ తేదీలను మార్చాలని ఇంజినీర్ బాపిరాజు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆయన రూ.15 లక్షల లంచం అడిగారు.
విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడు, శ్రీచంద్ అనే వ్యక్తి ద్వారా ఈ లంచం సొమ్మును అందజేస్తుండగా CBI అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్‌లలోని నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఈ కుట్రలో మరికొందరి పాత్రపై దర్యాప్తు చేస్తున్న అధికారులు, నిందితులను ఆగస్టు 17న విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు.







