భువనగిరి : పట్టణంలోని కుమ్మరివాడలో ఆదివారం బోనాల మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్‌, కౌన్సిలర్‌ బండారు స్వర్ణలత నాయకులు పాల్గొన్నారు.

పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన బోనాల వేడుకలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌ పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం తదితరులు పాల్గొన్నారు.