తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన మేకలను తోలుకుంటూ గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది.

రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన నిందితుడు, ఆమెపై రాడ్‌తో దాడి చేశాడు. అనంతరం ఆమెను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

అయితే, బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దాడి జరిగిన తర్వాత బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరగలేదని, అయితే తలకు బలమైన గాయాలయ్యాయని వైద్యులు ధ్రువీకరించారు.

ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహిళలకు రక్షణ లేదని, ఒంటరిగా కనిపిస్తే చాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.