టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గా రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జగ్గా రెడ్డి హనుమంతుడి వంటి వారని, ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పారు.

జగ్గా రెడ్డి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో జగ్గా రెడ్డి ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.