తెలంగాణ వ్యాప్తంగా 61 లక్షల మంది ఓటర్లకు వారి వివరాలను సరిచూసుకునేందుకు వీలుగా సవరణ కోరిక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని 20 లక్షల మంది ఓటర్లకు ఈ పత్రాలు అందుతాయి.
ఓటర్లు తమ పేరు, ఇంటి పేరు లేదా ఇతర వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈ సమయంలో సరిచేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ సవరణలకు అవకాశం కల్పించింది.
ఈ సవరణల కోసం ఆగష్టు 18న ప్రక్రియ మొదలై, సెప్టెంబరు 18 వరకు కొనసాగుతుంది. నిర్ణీత గడువులోగా ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.







