ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు, రక్షణ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నారు.
సేకరించే భూమిలో 1,609.23 ఎకరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వాయుసేన)కు కేటాయించనున్నారు. మిగిలిన 400 ఎకరాల్లో సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.
భూసేకరణకు అయ్యే పూర్తి ఖర్చును, ప్రాజెక్టుకు అడ్డంకులుగా ఉన్న విద్యుత్ లైన్లు, రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల తరలింపు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. భూసేకరణతో పాటు రోడ్లు, విద్యుత్ లైన్ల తరలింపు ప్రక్రియను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది.






