బుధవారం ఉదయం జరిగిన సౌత్ ఆస్ట్రేలియా, టాస్మేనియా దేశీయ వన్డే మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది. టాస్మేనియా స్పిన్నర్ రాఫ్ మెక్‌మిలన్ వేసిన బంతి భారీ వైడ్ మరియు డెడ్ బాల్‌గా నమోదైంది.
అయితే, ఆ బంతిని వదిలేయకుండా సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ జాక్ వెదరాల్డ్ క్రీజ్ దాటి మరీ షాట్ ఆడాడు. ఆ బంతి బౌండరీ దాటడంతో మైదానంలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు.
ఈ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించి, బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఫ్రీహిట్ ఇచ్చారు. ఫ్రీహిట్ అంటే బౌలర్ వేసే తదుపరి బంతికి బ్యాటర్ అవుట్ అయ్యే అవకాశం లేని అవకాశం. ఈ అవకాశాన్ని వెదరాల్డ్ చక్కగా ఉపయోగించుకున్నాడు.
ఫ్రీహిట్ బంతిని వెదరాల్డ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది.








