సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసే లోపు సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను సమాంతరంగా సాగిస్తూ చివరి నిమిషం వరకు కష్టపడే నిర్మాతలకు ఈ నిబంధన సవాలుగా మారింది.

నవంబర్, డిసెంబర్ నెలల్లో సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న మేకర్స్‌కు ఈ నిబంధన మరింత ఇబ్బందికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారం పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతుండటంతో, ఇన్ని చిత్రాలకు సరిపడేలా సెన్సార్ సిబ్బంది మరియు వౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సెన్సార్ పనులను వేగవంతం చేసే పద్ధతి కొనసాగుతోంది. అయితే 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్న రూల్ పాటించాల్సి వస్తే డేట్ల ప్రకటన కష్టంగా మారుతుందని నిర్మాతలు అంటున్నారు.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లతో ఇప్పటికే సతమతమవుతున్న వారికి ఈ కొత్త నిబంధన అదనపు భారంగా మారుతుందా లేక సెన్సార్ వ్యవస్థలో మార్పులు వస్తాయా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.