హైదరాబాద్‌లో నేడు కొత్త సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సకల సమృద్ధి ఆర్ట్స్ బ్యానర్‌పై కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు, గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. నిర్మాత కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో రాజీవ్ వర్మ, మలైకా టి. వాసుపాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నవంబర్ 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ చిత్రీకరణను మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

హైదరాబాద్ తర్వాత మిగిలిన షెడ్యూల్స్‌ను కోనసీమ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఈ సినిమా సకల సమృద్ధి ఆర్ట్స్ బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమా (ప్రొడక్షన్ నంబర్ 1) కావడం విశేషం.