విజయవాడకు చెందిన బానోతు సంతోష్‌ను నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు పిలిపించి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తామని కొందరు వ్యక్తులు నమ్మబలికారు. ఇందుకోసం రూ.1,51,000 నగదు తీసుకురావాలని వారు కోరారు. వారి మాటలను నమ్మిన సంతోష్ ఆ మొత్తంతో అక్కడికి వెళ్లగా, నిందితులు మాయమాటలతో డబ్బు తీసుకుని పరారయ్యారు.

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే బూర్గంపహాడ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ మేడ ప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా శనివారం సాయంత్రం నాగినేనిప్రోలు గ్రామంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ పంచనామా నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ నాగ బిక్షం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.