కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ విజేతగా నిలిచిన తమిళనాడు జట్టుతో ఆడేందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా అండర్-23 జట్టు సిద్ధమైంది. ఈ మేరకు జూనియర్ క్రికెట్ కమిటీ జట్టు సభ్యుల జాబితాను అధికారికంగా ప్రకటించింది.
ప్రియాంషు మోలియా ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అంగ్క్రిష్ రఘువంశి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారు.
ఈ జట్టులో ఆయుష్ జెత్వా, మనన్ భట్, దిగ్విజయ్ పాటిల్, రక్సిత్ మెహతా, ఎమాన్జోత్ సింగ్ చాహల్, చంద్రరాజ్ రాథోడ్, వరుణ్ సింగ్ భుయీ, గణేష్ సుతార్, నిఖిల్ గిరి, చేతన్ శర్మ, జి సుమిత్ సభ్యులుగా ఉన్నారు. వికెట్ కీపర్లుగా అరవెల్లి అవనీష్ రావు, మయాంక్ వర్మ ఎంపికయ్యారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 1 గురువారం మొదలై అక్టోబర్ 4 ఆదివారం వరకు ఈ పోరు కొనసాగుతుంది.








