హైదరాబాద్ సిటీ, వెలుగు సంస్థల సహకారంతో సీఎంసీ ప్రభుత్వం అధికారిక లోగో రూపకల్పన కోసం సీఎంసీ ప్రతిష్టాత్మక డిజైన్ పోటీని ప్రకటించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐయూఎం) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
లోగో డిజైన్లలో సుపరిపాలన, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం వంటి సీఎంసీ విలువలు ప్రతిబింబించాలని అధికారులు పేర్కొన్నారు. ఎంట్రీలు AI లేదా వెక్టర్ ఫార్మాట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి ఒకే ఎంట్రీని మాత్రమే సమర్పించవచ్చని నియమం.
గరిష్ఠంగా 250 పదాల్లో డిజైన్ తాత్వికతను వివరించే డాక్యుమెంట్‌తో పాటు పీఎన్‌జీ లేదా జెపీఈజీ ఫైల్‌ను జతచేయాలి. కాపీరైట్ ఉల్లంఘనలు లేదా AI జనరేటెడ్ డిజైన్లను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు హెచ్చరించారు.
మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండవది రూ.15 వేలు, మూడవది రూ.10 వేలు నగదు బహుమతులు అందజేయనున్నారు. ఆగస్టు 5 వరకు ఎంట్రీలు స్వీకరిస్తామని, 10న విజేతలను ప్రకటించి, 15న లోగోను అనావరణం చేస్తామని తెలిపారు. వివరాలకు QR కోడ్ స్కాన్ చేయమని సూచించారు.






