మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఒక సాధారణ ప్రమాద ఘటనను హత్యాయత్నంగా మార్చి, తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రతీకారంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని జగన్ విమర్శించారు.
ఈ కేసు విషయంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అయితే, సమయం మించిపోవడంతో అప్పలరాజును కలిసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడిని, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఒక యువకుడి భవిష్యత్తును నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.







