శ్రీశైలం ఘాట్ రోడ్డులో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.

భక్తుల రద్దీ పెరగడంతో శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే గంటల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రద్దీ కొనసాగుతోంది. మరోవైపు, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 878 అడుగుల వద్ద ఉండగా, కుడి మరియు ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.