మోత్కూరు : శ్రామిక నిపుణులకే శ్రమ శక్తి అవార్డు ఇవ్వడం అభినందనీయమని ప్రముఖ రచయిత, గాయకుడు గిద్దె రామనర్సయ్య అన్నారు. మోత్కూరుకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్‌ తన తండ్రి దొంతోజు బ్రహ్మచారి స్మారకార్థం ఏర్పాటు చేసిన శ్రమ శక్తి అవార్డును ఆదివారం సాయంత్రం మోత్కూరులో హైదరాబాద్‌ చిక్కడపల్లికి చెందిన యూనిక్‌ మారుతీ సర్వీసెస్‌ అధినేత ఎంతో పేరు గడించిన మెకానిక్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ జబ్బార్‌కు అందజేసి మాట్లాడారు. బ్రహ్మచారి నామమాత్రంగా చదువుకున్నప్పటికీ మెకానిజంలో ఎన్నో మెళకువలతో అనేక మిల్లుల్లో మిషనరీస్‌ ఏర్పాటు చేసిన ప్రతిభాశాలి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేంధర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్‌, ఆయన సోదరుడు రాజు, ప్రజా భారతి అధ్యక్షుడు బి.హన్మంతు, పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు డి.అరవింద రాయుడు, టి.ఉప్పలయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు కె.ప్రభాకర్‌రెడ్డి, జంగ శ్రీనివాస్‌, మర్రి అనిల్‌కుమార్‌, ప్రజా భారతి ప్రతినిధులు పాల్గొన్నారు.