నవంబర్ 18, 2026న వాల్‌స్ట్రీట్‌లోని సిప్రియాని వేదికగా నేషనల్ బుక్ ఫౌండేషన్ నేషనల్ బుక్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో భారతీయ అమెరికన్ రచయిత సల్మాన్ రుష్దీకి నేషనల్ బుక్ ఫౌండేషన్ 2026 సంవత్సరపు మెడల్ ఫర్ డిస్టింగ్యూష్‌డ్ కాంట్రిబ్యూషన్ టూ అమెరికన్ లెటర్స్ (జీవిత సాఫల్య పురస్కారం) ప్రదానం చేశారు.
మరొక అవార్డు గ్రహీత, భారతీయ అమెరికన్ రచయిత కిరణ్ దేశాయ్ సల్మాన్ రుష్దీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. సల్మాన్ రుష్దీకి ఈ అవార్డు దక్కనుందని సెప్టెంబర్ 10, 2026నే ఫౌండేషన్ ప్రకటించింది.
ఇదే వేడుకలో జేసన్ రినాల్డ్స్ చేతుల మీదుగా పెర్రి క్లాస్‌కు 2026 లిటరేరియన్ అవార్డు లభించింది. ప్రచురణకర్తలు ఈ ఏడాది నేషనల్ బుక్ అవార్డుల కోసం మొత్తం 1,912 పుస్తకాలను సమర్పించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.
ఫిక్షన్, నాన్ఫిక్షన్, పోయెట్రీ, ట్రాన్స్‌లేటెడ్ లిటరేచర్, యంగ్ పీపుల్స్ లిటరేచర్ విభాగాలలో ఈ పుస్తకాలను అందజేశారు.






