అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత రామాంజనేయరెడ్డి అపహరణకు గురయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారనే కోపంతో తెలుగు దేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు ఈ దాష్టీకానికి పాల్పడ్డారు.

ఈ కిడ్నాప్‌నకు ముందు పాతకొత్తచెరువు గ్రామంలోని వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగాయి. అయితే అప్పుడు వెంకటేశ్వర్లు ఇంట్లో లేకపోవడంతో, ఎమ్మెల్యే వర్గీయులు అక్కడి వారికి హెచ్చరికలు చేసి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే వర్గీయుల ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. ఈ గూండాగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని, పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.