నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో సమంత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. రాజ్ నిడిమోరు కథ అందించిన ఈ చిత్రం, 100 కోట్ల క్లబ్‌లో చేరి అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో సమంత మళ్లీ వరుస చిత్రాల్లో నటిస్తారని అభిమానులు ఆశించారు.
అయితే, సమంత తన వ్యక్తిగత జీవితంలో మరో మైలురాయి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్నెన్సీ కారణంగా సినిమాలకు కనీసం రెండేళ్లకు పైగా విరామం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే, 2027లో తిరిగి రావడం కష్టమని, 2028లో కానీ ఆమె మళ్లీ వెండితెరపై కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత డిజిటల్ ఆడియన్స్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నారు. ఇటీవల ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో రియాలిటీ షో కోసం ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో ‘ఆహా’ వేదికగా ‘స్యామ్ జామ్’ షో, అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన సమంత, ఈ కొత్త షో వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.








