Rain Alert | హైదరాబాద్‌, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో వారంపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఈశాన్య మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రీకృతమై ఉన్నదని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించినట్టు తెలిపింది.

ఆదివారం హైదరాబాద్‌తోపాటు జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్‌, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు.