ఓల్డ్ మాంక్ మద్యం తయారీలో న్యూట్రల్ స్పిరిట్ అంటే ఎటువంటి రుచి లేని ఆల్కహాల్‌తో పాటు రమ్ రుచిని ఇచ్చే రసాయనాలను వాడుతున్నారని FSSAI కోర్టులో పేర్కొంది. ప్రస్తుతమున్న నియమాల ప్రకారం దీనిని రమ్‌గా విక్రయించడం సాధ్యం కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఓల్డ్ మాంక్ బాటిళ్లపై లేబులింగ్ మార్చేందుకు తయారీ సంస్థ అంగీకరించింది. ప్యాకేజింగ్‌పై ‘జోడించిన ఫ్లేవర్’ అనే విషయాన్ని స్పష్టంగా రాయడంతో పాటు, ‘7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్’ అనే వివరణను తొలగించేందుకు కంపెనీ సిద్ధమైంది.

సవరించిన లేబుళ్లను పరిశీలన కోసం ఇప్పటికే సమర్పించినట్లు సమాచారం. అయితే ఈ వివాదంపై కోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇన్నాళ్లూ తాము తాగింది రమ్ కాదా అంటూ మందుప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ మాంక్‌తో తమకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు.