ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమయ్యడంతో హర్మూజ్ జలసంధి మూసివేయబడింది. ఈ పరిస్థితిలో గల్ఫ్ దేశమైన ఖతార్ ప్రజా భద్రత కోసం అత్యవసర నిర్ణయం తీసుకుంది. వాణిజ్య నౌకలు, విహార నౌకలు, చేపల వేట బోట్లతో సహా సముద్ర ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నౌకల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఖతార్ రాజధాని దోహాను లక్ష్యంగా చేసిన సందర్భంలో, కొందరు పౌరులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఈ దాడులను ఎదుర్కోవడానికి ఖతార్ సైనిక దళాలు పూర్తి సన్నద్ధతలో ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఒమన్ ప్రభుత్వం ఇరాన్ భూభాగంపై బాంబులు వేసే పద్ధతులను తీవ్రంగా ఖండించింది. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ చర్యలను బాధ్యతారాహిత్యంగా పేర్కొంది. హర్మూజ్ వివాదంపై ఇరాన్ తో జరిపిన చర్చల తర్వాత ఈ నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.







