ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని TRSMA ఆరోపించింది. ఈ వేధింపుల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉప్పల్ ప్రాంతంలో ఇటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏదైనా పాఠశాల వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు. నిజాన్ని నిర్ధారించుకున్న తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.







