పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఉద్దేశించి ఆమె గతంలో పలుమార్లు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక నెటిజన్ పూనమ్ కౌర్ పాత పోస్ట్‌ను గుర్తు చేస్తూ ఆమెకు మద్దతుగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కామెంట్ చేశారు. దీనికి స్పందనగా పూనమ్ కౌర్, “భవిష్యత్తులో నిజం మరింత గెలిచి తీరుతుంది. ప్రతి ఒక్కరికీ మనశ్శాంతి, సమస్యల నుంచి పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు.
ఈ ట్వీట్లో ఆమె పవన్ కళ్యాణ్ పేరును గానీ, ఆయన విడాకుల విషయాన్ని గానీ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, పవన్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పవన్ కళ్యాణ్, తనకు మధ్య దర్శకుడు త్రివిక్రమ్ అడ్డుగోడలా నిలిచారని పూనమ్ కౌర్ గతంలో ఆరోపించారు. పవన్ చుట్టూ కోట కట్టి తనను దరిదాపుల్లోకి రాకుండా చేశారని ఆమె వాదిస్తూ వస్తున్నారు. అయితే, వీరి ముగ్గురి మధ్య అసలు ఏం జరిగిందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
పూనమ్ కౌర్ ఎప్పుడూ పూర్తి వివరాలను బయటపెట్టకుండా, అప్పుడప్పుడు పరోక్షంగా చురకలు అంటిస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. భవిష్యత్తులో ఆమె ఏ నిజాలను బయటపెడతారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








